సిరా న్యూస్,సికింద్రాబాద్;
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపి వేసి నిరవధిక స్ట్రైక్ లోకి దిగారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించమంటున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అదికార ప్రతినిధి డా. అజయ్ కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలు పక్క రాష్ట్రంలో వలె ఇక్కడ కూడా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి రెగ్యులర్ గా స్టై ఫండ్ ఇవ్వాలన్నారు. ప్రతి ప్రభుత్వ దవాఖానలో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ కల్పించాలని, ఉస్మానియా హాస్పిటల్ కు నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్లన్ని మా కోసం మాత్రమే కాదని ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసమేనని ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.
========