విద్యార్థి బంధువులపై పాఠశాల యాజమాన్యం దాడి

అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఏబీవీపీ నాయకులు ఆరోపణ
సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మేధా హైస్కూల్లో గత శనివారం ఒక విద్యార్థి పాఠశాలలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురయ్యాడు ఆ విద్యార్థి ప్రస్తుతం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు ఈ విషయమై స్కూల్ యాజమాన్యం స్పందించడం లేదని ఈరోజు విద్యార్థి సంఘాలు మరియు విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ ధర్నా చేశారు ధర్నా చేస్తున్న సమయంలో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్కూల్ వద్దకు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేస్తున్న సమయంలో స్కూల్ యాజమాన్యంలో ఒక టీచర్ విద్యార్థుల యొక్క బంధువులపై దాడికి పాల్పడం వల్ల విద్యార్థి సంఘాలు మరియు బంధువులు ఆగ్రహానికి గురై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *