కుప్పంలో వైసీపీకి భారీ షాక్..!

మంగళవారం కుప్పంకు రానున్న సీఎం చంద్రబాబు..
రెండు రోజులు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన..
సీఎం చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ కీలక నేతలు పార్టీ వీడి టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం..
సిరా న్యూస్,చిత్తూరు;
వైసీపీ జడ్పీటిసిలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మరియు ముఖ్య నేతలు టీడీపీలో చేరుతున్నట్లు తెలిసింది. కుప్పంలో టీడీపీని కాళీ చేస్తామని గతంలో ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనేకమార్లు చెప్పారు. దీన్ని సవాల్ గా తీసుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తనదైన శైలిలో వ్యూహంతో ముందుకెళ్ళారు. ప్రస్తుతం కుప్పంకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ నాయకులకు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, కుప్పంలో వైసిపిని వీడి భారీగా టీడీపీలోకి చేరుతారనే ప్రచారంతో కుప్పంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేటట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు సీఎం చంద్రబాబు కుప్పంలో వుండబోతున్నారు. ఈ నేపధ్యంలో పలువురు వైకాపా నేతలు టీడీపీ లో చేరబోతున్నారు. వైసీపీ నేతలు టిడిపిలోకి చేరుతుండటంతో ఎమ్మెల్సీ శ్రీకాంత్ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు..
===========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *