సిరాన్యూస్,బోథ్
ట్రైనింగ్ సెంటర్‌ను బోథ్‌లో ఏర్పాటు చేయాలి: విశ్వకర్మ జిల్లా కన్వీనర్ బి రాజు యాదవ్
విశ్వకర్మ యోజన పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ట్రైనింగ్ సెంటర్ ను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఏర్పాటు చేయాలని విశ్వకర్మ యోజన జిల్లా స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జిల్లా కోఆర్డినేటర్ జి రాజు యాదవ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 6 0 63 మంది ఉన్నారని, వారందరికీ బోథ్ లో శిక్షణ సౌకర్యం కల్పించాల న్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సెంటర్ ఏర్పాటుకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ను రాజు యాదవ్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ జిఎం పద్మభూషణ, రాజు, ఆడియో డిపిఓ, డిఎన్పిఓ, డిఎస్ఆర్, జెడ్పి సీఈఓ ను పాల్గొన్నారు