సిరా న్యూస్,కడప;
కడపజిల్లా ప్రొద్దుటూరులోని ఓఎంఆర్ కాలనీలో మహేశ్వర్ రెడ్డి అనే యువకుడిని హత్య చేసి శవం మాయం చేసిన సంఘటన చోటుచేసుకుంది. నాగరత్నమ్మ, రామచంద్రారెడ్డి ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు నాగరత్నమ్మకు ముందు భర్త ద్వారా మహేశ్వర్ రెడ్డి జన్మించాడు.అయితే గత కొద్ది రోజుల నుంచి తన తల్లి నాగ రత్నమ్మ ను కలవకూడదు అని మహేశ్వరరెడ్డి రామచంద్రారెడ్డి కి చెప్తున్నాడు.ఈ క్రమంలోనే గత రాత్రి కూడా గొడవ జరిగినట్లు నాగరత్నమ్మ తెలిపింది.తెల్లవారి చూసేసరికి తన కొడుకు రూమునిండా, బెడ్ పైన రక్తపు మరకలు ఉన్నాయని,ఏమైంది తన కొడుకు ఎక్కడ అని అడుగగా రామచంద్రరెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడని మృతుడు తల్లి నాగరత్నమ్మ తెలిపింది.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
===