సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా కలెక్టర్ గా నియమితులైన కె. వెట్రిసెల్వి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మొదట ప్రకాశం జిల్లాలో శిక్షణా కలెక్టర్ గా పనిచేశారు. 2016 నుంచి ఏడాదిన్నరపాటు మదనపల్లి సబ్ కలెక్టర్ గా పనిచేస్తునే కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిణిగా అధనపు బాధ్యతలు నిర్వహించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ గాను, సమగ్ర శిక్షా ఎస్ పిడిగా పనిచేశారు. 2024 ఫిబ్రవరి నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో డైరెక్టర్ గా ఉన్నారు. తాజా బదిలీల్లో ఏలూరు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరేట్ లో ఉదయం9.30 గంటలకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశంలోని అతిపెద్ద రెవిన్యూ డివిజన్ గా గుర్తింపు పొందిన మదనపల్లి సబ్ కలెక్టర్ గా తనదైన శైలిలో రాణించారు. చిన్నవయస్సులోనే 2014లో ఐఎఎస్ లో 143 వ ర్యాంకును సాధించిన వెట్రిసెల్వి కుప్పం స్పెషల్ ఆఫీసర్ గా ప్రతిభ చూపారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. భూ సమస్యలన్నింటిని పరిష్కరించి తనదైన శైలి చూపించారు.
====