Dandu Devaraja: దండు దేవరాజు కుటుంబానికి రూ.63,500లు అంద‌జేసిన విద్యార్థులు

సిరాన్యూస్‌, కోనరావుపేట
దండు దేవరాజు కుటుంబానికి రూ.63,500లు అంద‌జేసిన విద్యార్థులు
మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2002-2003 పదవ తరగతి విద్యార్థులు స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచారు..దండు దేవరాజు అనే తోటి విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి రూ. 63500 దేవరాజు పిల్లల పేరిట పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మానవత్వాన్ని కాపాడుకున్నారు.కష్ట సుఖాలలో మేమున్నామంటూ దేవరాజు కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులందరికీ బెండ శ్రీనివాస్, నరేష్, కిరణ్, నాగరాజు, కృతజ్ఞతలు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో కుటుంబానికి బాండ్ పేపర్ అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *