పోలీసులు కేసు నమోదు
సిరా న్యూస్,మేడ్చాల్;
మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం పూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామంలో ఉన్న గంగస్థాన్ వెంచర్ కి చెందిన బి ఎల్ రెడ్డి వద్ద కు వెళ్లి తాను ఎమ్మార్వో కార్యాలయం నుండి వచ్చానని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బిఎల్ రెడ్డి రెండు లక్షల రూపాయల చెక్కును మహేందర్ రెడ్డికి ఇచ్చాడు. 2 లక్ష రూపాయలు తీసుకున్న మహేందర్ రెడ్డి మళ్లీ వెంచర్ దగ్గరకు వచ్చి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే వెంచర్ పనులు ఆపివేయాలని చెప్పారు. దీంతో బిఎల్ రెడ్డి మేడ్చల్ తాసిల్దార్ శైలజకు జరిగిన విషయాన్ని సమాచారం అందించాడు. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తాసిల్దార్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడని మేడ్చల్ పోలీసులకు మేడ్చల్ ఎంఆర్ఓ శైలజ ఫిర్యాదు చేసారు.. మేడ్చల్ ఎమ్మార్వో శైలజ ఫిర్యాదు మేరకు ఐపిసి 420,419,170 సెక్షన్ల కింద మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరో అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.