మంత్రి నిమ్మల
సిరా న్యూస్,అమరావతి;
గడచిన ఐదేళ్లలో సాగునీటి రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రైంతాంగానికి సాగునీరు అందలేదనే మాట రాకుండా, కాలువల ద్వారా చివరి ఎకరం దాకా నీరందించేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వర్షాకాలానికి ముందే మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులను సీఎం చంద్రబాబు కేటాయించినట్లు తెలిపారు. వర్షాలు పడనున్నందున వరద పరిస్థితులు తలెత్తకుండా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సాగునీటికాలువలలో పూడికను.. గుర్రపుడెక్కను తొలగించాలన్నారు.