విధులకు హాజరుకాని మందలూరు సచివాలయ సిబ్బందికి మెమో

సిరా న్యూస్,రుద్రవరం;

విధులకు గైరాజరైన మందలూరు సచివాలయ సిబ్బందికి మెమో జారీ చేసినట్లు ఈవోపి ఆర్ డి శ్రీనివాస శర్మ తెలిపారు. బుధవారం ఆయన సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జూన్ 1 నుంచి 26వ తేదీ వరకు హాజర పట్టికలో సంతకాలు చేయనటువంటి 4 గురు సచివాలయ సిబ్బందికి మెమో జారీ చేశామని వారు 3 రోజుల్లోగా మెమోకు తమ వివరణ ఇవ్వాలని తెలియజేశామన్నారు. సచివాలయాలకు సక్రమంగా హాజరుకాని సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా సిబ్బంది నిర్వహించాలన్నారు. హాజరు పట్టికలో తప్పనిసరిగా సంతకాలు చేయాలన్నారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *