సిరా న్యూస్ ఆదిలాబాద్
మహాలక్ష్మి మా పొట్టకొట్టింది..
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి ( మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ) తమ పొట్ట కొట్టిందని. బుధవారం నాడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ అసోసియేషన్, ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఠాకూర్ హోటల్ వద్ద ధర్నా నిర్వహించారు .అప్పులు, చేసి ఫైనాన్సులు తెచ్చి ఆటోలు కొన్నాం, వచ్చేనెల ఈఎంఐ కట్టే పరిస్థితులు కనిపించడం లేదని వారు వాపోయారు.ఈ కార్యక్రమంలో దళిత యూనియన్ ప్రెసిడెంట్ చందా, ఆటో స్టాండ్ డ్రైవర్స్, ఏఐటియుసి దేవేందర్, రాజు, దేవదాస్, రేంజర్ల రాజు, బండారి వెంకటేష్, కాపుడే సుభాష్, సిరిపురి మారుతి, చిలకల శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు