సిరాన్యూస్, ఖానాపూర్
స్టార్టర్లకు ప్యానల్ బాక్స్ ఏర్పాటు : కౌన్సిలర్ పరిమి లత సురేష్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఐదో వార్డులోని ఇంద్రానగర్ గంగపుత్ర కాలనీ, ఇంద్రనగర్, కరీం కాలనీలో శుక్రవారం ఉన్నటువంటి మోటార్లకు దగ్గర ఉన్నటువంటి స్టార్టర్లకు ప్యానల్ బాక్స్‌లను వార్డ్ కౌన్సిలర్ పరిమి లత సురేష్ ఏర్పాటు చేయించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ప్రతి స్టార్టర్ దగ్గర ప్యానల్ బాక్స్ ఏర్పాటు చేసి ఎంత వర్షం పడ్డ గాని తడవకుండా ఉండి ప్రజలకు కరెంటు ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చేశామని తెలిపారు.