సిరాన్యూస్, బేల
అంకిత భావంతో పని చేస్తే గుర్తింపు: ఎంఈఓ శ్రీనివాస్
* ప్రధానోపాధ్యాయుడు గజ్భారే భీంరావుకు ఘన సన్మానం
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని ఈ వృత్తిలో అంకిత భావంతో పనిచేస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని మండల విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దహేగావ్ ప్రాథమికున్నత పాఠశాలలో పనిచేస్తూ ఈనెల 30న పదవి విరమణ చేయనున్న ప్రధానోపాధ్యాయుడు గజ్భారే భీమ్రావుకు శుక్రవారం పాఠశాలలో సన్మాన కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులు ఉపాధ్యాయులు నాయకులు ఆయన్ను సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి విద్య ప్రమాణాలు పెంచేందుకు ఆయన చేసిన కృషిని వక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె, రవీందర్, మాజీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ కుమార్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వామి, నితిన్, నాయకులు గ్రామస్తులు రాందాస్ నక్లే, వాన్ ఖడే, దత్తా నికం, విట్టల్ పరాతే, కాహీర్, శంకర్, శుభం, బేలా మాజీ సర్పంచ్ తేజ్ రావ్ మస్కే, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.