Amylineni Surendra Babu: పింఛన్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
పింఛన్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యియి. 7 వేల రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లను నూతన ప్రభుత్వం అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దేకె అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం మండలం మోరెపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యియి. 7 వేల రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లను నూతన ప్రభుత్వం అందించనుంది. ప్రజల వద్దకే పాలన అన్న దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి అడుగు వేయనున్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7 వేల రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లను నూతన ప్రభుత్వం అందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సిబ్బంది పింఛను నగదుతో పాటు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందించనున్నారని తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వం పింఛను కింద ఎంత నగదు అందిస్తోందో తెలిసేలా రసీదు ఇస్తారు. మరో రసీదుపై లబ్ధిదారుల సంతకం తీసుకుని వాటిని ప్రభుత్వానికి నివేదిస్తారు. సామాజిక భద్రత పింఛనుదారులకు తొలి నుంచి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేసారు.2014లో టీడీపీ అధికారం చేపట్టగానే 200 నుంచి వెయ్యి రూపాయలకు ఒకేసారి 5 రెట్లు పెంచింది. ఆ తర్వాత మరో విడత వెయ్యి నుంచి 2 వేలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య ఏడాదికి 250 చొప్పున నాలుగు విడతల్లో వెయ్యి రూపాయిలు పెంచింది.ప్రస్తుతం పింఛనుదారులకు 3 వేల చొప్పున అందుతుండగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి 4,000 చేశారన్నారు . దీంతోపాటు ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మా నాయకుడు చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు గాను 1,000 చొప్పున కలిపి మొత్తం 7 వేలు నేడు పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులకు, బహుళ వైకల్యం సంభవించిన వారికి ఒకేసారి 3 వేల పెంచి 6 వేల రూపాయల చొప్పున అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *