సిరాన్యూస్,ఆదిలాబాద్
డికోడబుల్ టెక్ట్స్ బుక్స్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఒకటి, రెండు తరగతుల కోసం “రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్” రూపొందించిన డికోడబుల్ టెక్ట్స్ బుక్స్ ను ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. రూం టూ రీడ్ ఇండియా రాష్ట్ర మేనేజర్ నరసింహా చారి గత సంవత్సరంలో రూం టూ రీడ్ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాల నివేదికను అందజేశారు. వచ్చే నెలలో రూం టూ రీడ్ సంస్థ రూపొందించిన మాడల్ లైబ్రరీల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఎఎమ్ఒ శ్రీకాంత్ గౌడ్, రూం టు రీడ్ రాష్ట్ర ప్రతినిధి ఎస్. ప్రవీణ్, ప్రాజెక్టు అధికారి టి. నితిన్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.