మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
సిరా న్యూస్,హైదరాబాద్;
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు అమలు చేయాలని మోతిలాల్ నాయక్ నిరాహారదీక్ష చేశారు.ఆయనకు ఇవాళ నేను సంఘీభావం తెలిపానని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. . ఆయన చేసిన దీక్ష వల్ల ప్రభుత్వం పై ఒత్తిడి వచ్చింది దీనితో అతన్ని ఎవరిని కూడా కలవకుండా మోతిలాల్ ను ఇబ్బంది పెట్టారు. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇవాళ దీక్ష విరమించారు. ఆయనకు తండ్రి లేడు కానీ నిరుద్యోగ యువత కోసం ఆయన పోరాటం యువతకు స్ఫూర్తి. ఆయన కిడ్నీలు ఇతర అవయవాలు దెబ్బతిన్నాయి.అందుకే దీక్ష విరమించారు. అయినప్పటికీ మళ్ళీ పోరాటం చేస్తా అంటున్నాడు. కేసీఆర్ మా గిరిజన బిడ్డలకు పొడు భూములు ఇవ్వడం,గురుకులలాలు ఏర్పాటు చేయడం,ఎస్టీ ఎంటర్ ఫ్యూనర్ స్కిం పెట్టడం వంటివి చేశారు. ఇవన్నీ పథకాలతో మా సమాజంలో వెలుగులు నిండాయి దీనితో మా గురిజన బిడ్డలను కేసీఆర్ కు దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మొదటగా మోతిలాల్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని గ్రహించి పోరాటం చేశాడు అందుకు నేను మనస్ఫూర్తిగా అభినందస్తున్న. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి లేదంటే తిరుగుబాటు కు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చిన్న కుటుంబం లో పుట్టిన మోతిలాల్ మీ మోసాలను గ్రహించి పోరాటం చేశాడు.రానున్న రోజుల్లో ప్రజలు అందరూ తిరుగుబాటు చేస్తే పోలీసులు సరిపోరు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాటాలు చేస్తారు వారికి మా పార్టీ అండగా ఉంటుంది. ప్రతి సమస్య పై మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం మెడలు వంచుతుంది. మిమ్ములను గ్రామాల్లో తిరుగనివ్వకుండా అడ్డుకుంటారు ప్రజలు.మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే వేయాలి. అప్పుడే మీ ప్రభుత్వం ను నమ్ముతారు.మీ పై నమ్మకం ఏర్పడుతుంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి.మానభంగాలు జరుగుతున్నాయి. ఎప్పుడో దాడులు జరిగితే ఇవాళ మంత్రి పోతుంది.దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మోరిగినట్టు ఉంది మంత్రి వ్యవహారమని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లేందుకు సమయం ఉంది కాని బాధితులను పరమర్శకు సమయం లేదు అంతేకాదు ఢిల్లీలో హామీ వస్తే తప్ప ఇక్కడ పరామర్శ లేదని అన్నారు.