సిరాన్యూస్, శంకరపట్నం:
త్వరలో మాదక ద్రవ్యాల నిరోధక సైనికుల ఫోరం ఏర్పాటు
* బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్
శంకరపట్నం మండలంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు త్వరలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక సైనికుల ఫారం ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం శంకరపట్నం మండలంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శంకరపట్నం మండలం లోని ప్రతి గ్రామాన మాదక ద్రవ్యాల వలన యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గత కొద్ది రోజులుగా చాలా మంది పిల్లలు అతివేగంగా బైకులు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. చదువులు మానేసి బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు.అందుకోసం మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల సహకారంతో ప్రతి గ్రామాన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగవహన సదస్సు ల కార్యక్రమాలు నిర్వహించి ప్రణాళిక బద్దంగా పోరాటం చేస్తామని అన్నారు . కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్, మండల అధ్యక్షులు బొంగోని అభిలాష్, ఎంఆర్ పీఎస్ మండల అధ్యక్షులు కనుకుంట్ల శ్రీనివాస్, టీడీపీ నాయకులు అరిఫ్, నాయకులు చల్లూరి రాజేందర్, కోడూరి మహేష్, సామల హరీష్, తదితరులు పాల్గొన్నారు.