సిరాన్యూస్, భీమదేవరపల్లి
ముల్కనూర్ లో ఎమ్మార్పీఎస్ మహాదీక్ష పోస్టర్ ఆవిష్కరణ
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ఎస్సీ వర్గీకరణ పై రాజకీయ పార్టీల వైఖరికి నీరసనగ ఈనెల 7న హైదరాబాద్ లో టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ చేపట్టనున్న మహా దీక్షను విజయవంతం చేయాలని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మహాదీక్ష పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా టిఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అంబాల చక్రపాణి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాంగ్రెస్, బిజెపి పార్టీలు గత కొన్ని సంవత్సరాల నుండి ఓటు బ్యాంకుగా వాడుకొని మాదిగలను మోసంచేశాయని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ పదేళ్ల పాలనలో మాదిగలను నిలువునా మోసం చేసిందన్నారు.ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ తాను మాదిగల పెద్దన్ననని వర్గీకరణ బిల్లు పెట్టించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారని,ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందని, అధికారంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలనిడిమాండ్ చేశారు. జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ మహాదీక్షకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ టీఎస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు అంబాల చక్రపాణి,ఎమ్మార్పీఎస్ టిఎస్ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు కొమ్ముల నగేష్, సమ్మక్క సారక్క ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ మాడుగుల అశోక్, మండల నాయకులు మాడుగుల ప్రభాకర్ మాడుగుల అశోక్ గడిపి మొగిలి కొమ్ముల రవీందర్ అంబాల బకరాజు గడిపె రమేష్ తాళ్లపల్లి అశోక్ గడిపే రాజేష్ మైసూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.