MLA Surendra Babu:  ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్  సెంటర్‌ను ప్రారంభించిన‌ ఎమ్మెల్యే సురేంద్రబాబు

సిరాన్యూస్‌, క‌ళ్యాణ‌దుర్గం
 ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్  సెంటర్‌ను ప్రారంభించిన‌ ఎమ్మెల్యే సురేంద్రబాబు

ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ పై సంతకం చేయడంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో యువత కోసం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా సురేంద్ర బాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని సంకల్పించారు.అందులో భాగంగా బుధ‌వారం కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే అమిలినేని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ… గత ఐదేళ్లు ఉద్యోగ ప్రకటనలు రాక అనేక ఉద్యమాలు చేసి నానా ఇబ్బందులు పడ్డారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకమే డీఎస్సీ పై చేయడం చాలా సంతోష దాయకమ‌ని తెలిపారు. మెగా డీఎస్సీలో ఎక్కువ పోస్టులు సాధించిన కళ్యాణదుర్గం ప్రాంతం పేరును రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించేలా చేయాలని కోరారు. మన రాష్ట్రంలో గ్రూప్ వన్ లో మొదటి ర్యాంకర్ గా నిలిచి మన కళ్యాణదుర్గం ఆర్డీఓగా ఉండటం మీ అందరికి స్ఫూర్తి దాయకమ‌ని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉండడం, ఆయన కష్టపడే వ్యక్తి విద్యార్థుల కష్టాలు తెలుసుకుని మరిన్ని పోస్టులు తీసుకువస్థారన్న నమ్మకం ఉండన్నారు.. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి అందరూ ఉద్యోగాలు పొందాలని కోరారు. కోచింగ్ సెంటర్ ప్రారంభానికి ఆర్డీఓ రాణి సుస్మిత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున డీఎస్సీ అభ్యర్థులు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *