సిరాన్యూస్, ఖానాపూర్
పాలకవర్గం సభ్యులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల ప్రజా పరిషత్ ఖానాపూర్ , మండల ప్రదేశిక నియోజకవర్గం సభ్యులు, మండల కోఆప్షన్ సభ్యులకు ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పాలకవర్గం సభ్యులను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ఘనంగా సన్మానించారు. అనంతరం పాలకవర్గం సభ్యులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు ఖానాపూర్ మండల అభివృద్దే ద్వేయంగా ప్రజా సేవలో ఉంటూ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , షబ్బీర్ పాషా , నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.