సిరా న్యూస్,సికింద్రాబాద్;
వికలాంగుల పెన్షన్ రూ.6000 వెలు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలకు రూ.4000 వెలు పెన్షన్ పెంచిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎం అర్ పి ఎస్ వి ఎచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 5వ తేదిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మహాధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు.అందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్ నుండి బారి ఎత్తున వికలాంగులు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాధర్నా విజయవంతం చేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన్.వినయ్ అల్వాల్ సర్కిల్ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వికలాంగుల పెన్షన్ రూ.6000 వృద్దులు వితంతువులు ఒంటరి మహిళల పెన్షన్ రూ.4000 పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న పెంచిన పెన్షన్ ఇంకా అమలుచేయకపోవడం బాధాకరం.కావున ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే పెంచిన పెన్షన్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి ఎచ్ పి ఎస్) డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎరుపలి.మంగమ్మ మల్కాజిగిరి మండల అధ్యక్షురాలు బండారి.లక్ష్మీ సెం వి ఎచ్ పి ఎస్ సీనియర్ నాయకులు వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.సురేష్ కుమార లింగం రజిత విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
=======================