Jogupremendar: వీధి వ్యాపారులకు గొడుగులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
వీధి వ్యాపారులకు గొడుగులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షులు జోగురామన్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం విస్తృత సేవా కార్యక్రమాలను చేపట్టారు. సమాజ హితం కోరుతూ పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్‌ పట్టణంలోని రైతు బజార్ లో కూరగాయలు విక్రయించే వారికి, స్కూల్ విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ గొడుగులను పంపిణీ చేశారు. ఈసంద‌ర్బంగా బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ మాట్లాడుతూ ప్రజా నాయకుడు, మాజీ మంత్రి జోగురామన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కూరగయలు విక్రయించే వారితో పాటు స్కూల్ విద్యార్థులకు గొడుగులను అందచేయడం జరిగిందన్నారు. వర్షంలో వారు ఇబ్బందులు పడకూదదన్న ఉద్దేశంతో వీటిని పంపిణి చేసినట్లు తెలిపారు. ప్రజాశీర్వాదంతో మాజీ మంత్రి జోగురామన్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, కౌన్సిలర్ వేనుగంటి ప్రకాష్, శివకుమార్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *