సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన ఐబీఏ గార్డెన్ ను కూల్చిసారు. ఇది అక్రమంగా పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరిగాయి అంటూ పలుమార్లు నోటీసులు జారీ చేసారు. నోటీస్ లకు స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఐబిఏ గార్డెన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కూల్చివేతను నిరసిస్తూ ఐబిఏ నిర్వాహకులు ఆందోళనకు దిగారు.
=======================