సిరా న్యూస్,మేడ్చల్;
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక ప్రజల ఇబ్బందులపై ఎమ్మెల్యే అనేకసార్లు అధికారులతో చర్చించిన ఫలితం లేకపోయిందని బిఆర్ఎస్ వర్గాల ఆరోపణ , మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చెరువుతోనే ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ నాయకుల వాదన. ప్రారంభమైన రోడ్డు పనులను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే చేరుకోగా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది.
===