సిరా న్యూస్, ఆదిలాబాద్
బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటాం: సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీలు నాయకులు ధర్నా
బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ కేంద్రం ప్రభుత్వ తీరుకు నిరసనగా వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ ,సీపీఎంఎల్ మాస్ లైన్ ,సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ల ఆధ్వర్యంలో నాయకులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ , సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ,సీపీఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ , సీపీఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ నారాయణ లు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ ఆస్తులు పెంచడానికి సింగరేణిని ఆయనకు కట్టబెట్టడానికి బొగ్గు గనులను వేలం వేస్తుందని విమర్శించారు . సిగరేణి బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు . సింగరేణి కే బొగ్గు గనులను అప్పగించాలని డిమాండ్ చేశారు . ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి వల్ల ప్రభుత్వానికి లాభాలు వస్తున్నాయి . వెలది మంది కార్మిక కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది అలాంటి సంస్థను ప్రయివేటీ కరించాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించు కోవాలని హితవు పలికారు . ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీంరావు ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ ,పూసం సచిన్ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న,ఆర్.మంజుల, ఐద్వా నాయకులు లంక జమున ,కోవే శకుంతల . పోచక్క భీంపూర్ మండల కన్వీనర్ ధొనిపెల్లి స్వామి సీఐటీయూ నాయకులు అగ్గిమల్ల స్వామి ,లింగాల చిన్నన్న ,ఇంద్రజి , సిపిఐ జిల్లా నాయకులు అరుణ్ కుమార్, కుంటల రాములు , సీపీఎంఎల్ మాస్ లైన్ నాయకులు సురేష్ , రేణుక న్యూడెమోక్రసీ నాయకులు వామన్ ,గణేష్ ,గంగమ్మ ,దత్తు ,శ్యామ్ , ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు .