సిరా న్యూస్,హైదరాబాద్;
పాత బస్తీ హనుమాన్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ పనిచేయకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్ నగర్ లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు రోడ్లపై పారుతుండడంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితమవుతుండడంతో అంటు వ్యాధులుప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు.నీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
====