Dr. Sarfaraj: వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి : డా.సర్ఫరాజ్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి : డా.సర్ఫరాజ్
* ఆశ్రమ పాఠశాలలో వైద్యశిబిరం

ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాల‌ని డాక్ట‌ర్ సర్ఫరాజ్ అన్నారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగుడా ,వాన్వట్ ఆశ్రమం ఉన్నత పాఠశాలలో వైద్యశిబిరాలు నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ చుట్టూ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని తెలిపారు.ముందస్తుగా మెడికల్ క్యాంపులను పెట్టిన‌ట్లు తెలిపారు.మామిడిగుడా బాలికల ఉన్నత పాఠశాలలో 46 మంది బాలికలకు చిరు వ్యాధులు, సర్ది,దగ్గు,జ్వరం,గోకుడు దురద మొదలైనవాటికి మందులు అంద‌జేసిన‌ట్లు చెప్పారు.వాన్వట్ బాలుర పాఠశాలలో 34 మంది విద్యార్థులకు చిరు వ్యాధులకు వైద్య సేవలు అందించామ‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో అంకొలి వైద్యసిబ్బంది హెల్త్ సూపర్ వైజర్ బొమ్మెత సుభాష్, మర్శుకొల లక్ష్మీ బాయి, ఆరోగ్య కార్యకర్తలు ఇందు బాయి, ఈశ్వర్ రెడ్డి, ల్యాబ్ టెక్నిషన్ మడవి శ్రీనివాస్ ఆశాకార్యకర్తలు రుక్మిణి, మామిడిగుడా హెడ్ మాస్టర్ సుగుణ, వాన్వట్ వార్డెన్ ప్రతిభ లు పాల్గొన్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *