సిరా న్యూస్,సికింద్రాబాద్;
నిమ్స్ లో విధులు నిర్వహించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్యచేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో అనస్థీషియా మత్తు వాయిల్ తీసుకున్నారు. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
====