సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఏఈ,గ్రామపంచాయతీ కార్యదర్శికి మెమోరాండం
సిరా న్యూస్,దేవనకొండ;
మండల కేంద్రమైన దేవనకొండ నందు వీధి స్తంభాలతో పాటు వీధిలైట్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం. నరసరావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఏఈ మరియు మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శికి మెమోరాండం సమర్పించడం జరిగినది. అనంతరం వారు మాట్లాడుతూ…. మండల కేంద్రమైన దేవనకొండ నందు వివిధ కాలనీల నందు వీధిలైట్లు లేక రాత్రి సమయంలో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీధిలైట్లు ఏర్పాటు చేయాలని గతంలో అనేకమార్లు పంచాయతీ కార్యదర్శిని కోరినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులకు సిఫారసు చేసి చేతులు దులుపుకోవడం తప్ప పరిష్కారానికి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేసే విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శిని కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సరి కాదన్నారు వీధిలైట్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని లేనిపక్షంలో కాలనీ ప్రజలను సమీకరించి ధర్నా కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సి. కృష్ణ, నల్ల చెలిమల శాఖ కార్యదర్శి బజారి, ప్రజాసంఘాల నాయకులు రాఘవేంద్ర, సుల్తాన్, భాష, కోమేష్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.