సహకార సంఘాల అభివృద్ధి లో రైతులు భాగ స్వాములు కావాలి
ఛైర్మన్ అధ్యక్షులు అలసకాని జనార్దన్
చిలుకూరు లో ఘనంగా అంతర్జాతీయ సహకారదినోత్సవం
సిరా న్యూస్,సూర్యాపేట జిల్లా;
రైతు సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం అని చిలుకూరు పిఏసీఎస్ ఛైర్మన్ అలసకాని జనార్థన్ అన్నారు. శనివారం చిలుకూరు పిఏసీఎస్ లో 102 వ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సహకార బ్యాంకులో జెండా ఎగుర వేసి మాట్లాడారు.ప్రతి ఏడాది జూలై మొదటి శనివారం ఈ దినోత్సవం జరుపుకుంటామని దీనికి ముఖ్య ఉద్దేశం సహకార రంగం పట్ల అవగాహన పెంచడం అన్నారు. సహకార ఉద్యమం ద్వారా అంతర్జాతీయ సంఘీభావం, ఆర్థిక సామర్థ్యం , సమానత్వం ప్రపంచ శాంతి కొరకు ప్రోత్సహించే దిశలో ఆలోచించడం అన్నారు. సహకార సంఘాలు ఏర్పడ్డాకనే రైతుల జీవితాలలో మార్పులు వచ్చాయని అన్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు సహకార సంఘం బ్యాంకులు అన్ని సదుపాయాలు రైతులకు కలిగిస్తున్నాయని అన్నారు. రైతులకు, డైరెక్టర్ లకు సహకార దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి చిలువేరు లక్ష్మీనారాయణ ,డైరెక్టర్స్ కొండా సోమయ్య, కస్తూరి సైదులు, కోడారు రాంబాబు, రైతులు సిబ్బంది పాల్గొన్నారు.