సిరా న్యూస్,కోదాడ;
సరైన వర్షాలు లేక నాగార్జునసాగర్ డ్యాం లో నీళ్లు లేక ఖరీఫ్ పంట సాగుకు నీరు వస్తాయో రావో అని నిరాశగా ఎదురుచూస్తున్న రైతుకు ఇటీవల కురిసిన వర్షాలకు తన పొలంలో వున్న బోరు మోటార్ వేయకుండానే నీరు పైకి ఉబికి రావడంతో రైతు సంతోషం వ్యక్తం చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం పోలేని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.రాందేని సైదయ్య అనే రైతు కు ఆరు ఎకరాల భూమి లో బోరు వేసాడు.గతం లో ఇంతకంటే వర్షాలు ఎక్కువ కురిసిన బోరులో నుంచి నీరు పైకి ఉబికి వచ్చేవి కాదన్నారు.ఈ మధ్యకాలంలో కురిసిన కొద్ది వర్షానికి బోరులో నీరు రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు.