సిరాన్యూస్, భీమాదేవరపల్లి
ఎమ్మార్పీస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి
హుస్నాబాద్ నియోజక వర్గ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జ్ మాట్ల వెంకట్ స్వామి
ఎమ్మార్పీస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని హుస్నాబాద్ నియోజక వర్గ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మాట్ల వెంకట్ స్వామి అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు.30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణతో పాటు ,భారతదేశంలోని ప్రజా సమస్యలపై, నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఆదివారం వరంగల్ లో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ప్రతి మాదిగ పల్లెలో 30 సంవత్సరాల ఆవిర్భవన దినోత్సవ కార్యక్రమాన్ని అన్ని గ్రామంలో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ , ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ, తాళ్లపల్లి మధుకర్ మాదిగ అడ్వకేట్,నక్క సునీల్ మాదిగఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు,ఎంఎస్పీ పార్టీ అధ్యక్షులు పారినందుల సురేష్మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు మాడుగుల ప్రభుదాస్, వర్కిల కిషోర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.