Hanmakonda: జగ్జీవన్ రామ్ వర్ధంతి… హన్మకొండ బార్ అసోసియేషన్ స‌భ్యులు నివాళులు

సిరాన్యూస్, హన్మకొండ:
జగ్జీవన్ రామ్ వర్ధంతి… హన్మకొండ బార్ అసోసియేషన్ స‌భ్యులు నివాళులు

భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ ల అధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ బైరపాక జయకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం, బహుజనులను రాజకీయంగా చైతన్యం చేయడం కోసం అహర్నిశలు కృషి గొప్ప వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాతంగి రమేష్ బాబు, జనరల్ సెక్రటరీ లాడే రమేష్, టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ స్పోక్ పర్సన్ వేముల రమేష్, ఎంఎల్ఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొంగర పూర్ణచందర్, ఎంఎల్ఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గోవింద్ నాగభూషణం, సీనియర్ న్యాయవాదులు సూర్య రావు, డేవిడ్ రాజ్ కుమార్, కొండపాక కృష్ణ, జన్ను ఆనంద్ కుమార్, మహిళా న్యాయవాదులు చిలుక భాగ్యమ్మ, హన్మకొండ బార్  ఈసీ అనిత, రమాదేవి, సౌందర్య, చిట్యాల రమేష్, హన్మకొండ బార్ ఈసీ మెంబెర్ అచ్యుత్ కుమార్, జె ఎస్ ఎం.విజేందర్, వరంగల్ బార్ ఈసీ మెంబర్ పెండ్యాల అనిల్ కుమార్ ,దుబ్బ అనిల్, ఈరా మహేందర్, ఎలామాద్ర రవి, మెరుగు సుభాష్, ఫణి, అరుణ్, శ్రీనివాస్, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ కందుకూరు రజినీకాంత్, పిల్లి కార్తీక్, కిస్టోజు శివకుమార్, జాషువా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *