సిరాన్యూస్, ఆదిలాబాద్
మరపురాని మహానేత వైఎస్ఆర్ : డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి
* కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలు
* చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు
మరపురాని మహానేత వైఎస్ఆర్ అని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన దైన ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరపు రాని మహానేత అని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.2003 లో 11 జిల్లాలలో 60 రోజులలో ఆయన చేసిన 15వందల కిలోమీటర్ల పాదయాత్ర అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా పేర్కొన్నారు. ఆ పాదయాత్ర ద్వారానే 2004 , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చిన ధీరుడని గుర్తు చేసుకున్నారు. పోటీ చేసిన ప్రతీ ఎన్నికల్లోను విజయం సాధించి అపజయమంటే ఎరుగని విజేత వైఎస్ఆర్ అన్నారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ప్రజల వద్దకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఆ మరణ వార్త విని ఎందరో అభిమానుల గుండెలు ఆగిపోయాయన్నారు. భౌతికంగా ఆయన దూరమైనా సంక్షేమ పథకాల ప్రతీ పేరులోను ఆయన గుర్తు కొస్తారన్నారు. ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోతారన్నారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ కాంగ్రెస్ నాయకుడు , కార్యకర్త చిత్త శుద్ధితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, జైనథ్ మాజీ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్,ఆవుల వెంకన్న, దర్శనాల లక్ష్మణ్, రాము, జాఫర్ అహ్మద్, భూమన్న,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్,నాయకులు ఎం.ఏ షకీల్,పత్తి ముజ్జు,డేరా కృష్ణ రెడ్డి,బండి దేవిదాస్ చారి,సుధాకర్ గౌడ్, అల్లూరి అశోక్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,రాజేశ్వర్,భరత్ శ్రవణ్ నాయక్,కుంట కిష్టా రెడ్డి,రమేష్,మన్సూర్, అయాస్,అతిక్ ఉర్ రెహమాన్, తిరుమల్ రెడ్డి, ఎల్మ రామ్ రెడ్డి,రాజా రెడ్డి,అన్సర్ పటేల్, మున్నా, సమీ ఉల్లా ఖాన్,అతిక్, మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ, షబానా, జబీనా, రూప, ప్రేమిల, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.