మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
సిరా న్యూస్,రాయచోటి;
రాయచోటి నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు పైగా విలువ చేసే ప్రభుత్వ,పేదల భూములును వైసిపి నేతలు కాజేశారని రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
సంబేపల్లె మండలం దేవపట్ల గ్రామంలో పెద్దరెడ్లు అని చెప్పుకొంటున్న కుటుంబాలు వంక పొరంభోకుతో పాటు జాతీయ రహదారికి అనుకొని 40 ఎకరాలు స్థలాన్ని ఆక్రమించారు. చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవడము లేదు. ఎవరైతే రెవిన్యూ పరంగా ముఖ్య భూమిక పోషిస్తున్నారో వారికి మేము మా రాయచోటి నియోజకవర్గంలో అవినీతి భూములను వెలికి తియాలంటూ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోండి. ప్రభుత్వ భూములను, పేదల స్థలాలు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు. పేదల భూములు,ప్రభుత్వ భూములు వైసిపి కి చెందిన గ్రామ స్థాయి నుండి నియోజకవర్గం స్థాయి నాయకులు ఆక్రమించారని అఅన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను మంత్రి ఆర్డీవో రంగా స్వామి,రెవిన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
=======