సిరా న్యూస్,గుంటూరు;
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సామాన్య పౌరుడు అయిన సుధాకర్ పై తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మరియు వారి అనుచరులు దాడికి దిగిన విషయం తెలిసిందే.
ఈ దాడికి సంబంధించి తెనాలికి చెందిన సుధాకర్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. స్పందించిన ఐజీ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు బాధితుడు తెలిపారు. హత్యాప్రయత్నం సెక్షన్ జోడించాలని ఐజీని కోరినట్లు సుధాకర్ చెప్పారు.
=