సిరా న్యూస్,రంగారెడ్డి;
నాగోల్ లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. తన పిల్లలకు టిసి, బోనోపైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తురని ఆవేదన వ్యక్తం చేసాడు. అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసనకు దిగాడు. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్ లో చదివితే 6ఏళ్లుగా బోనోపైడ్,టిసి కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపించాడు. కాళ్ళు మొక్కినా కనికరించలేదని ధర్మరెడ్డి అనే పేరెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేసాడు.