ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డును సన్మానించిన పోలీస్ కమిషనర్
సిరా న్యూస్,ఖమ్మం;
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు షేక్. మాస్తాన్ హ్ ఎచ్ సి 595 ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. రిటైర్ మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని, మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో,ఏ అర్ ఏసీపీ సుశీల్ సింగ్, హోంగార్డ్ ఆర్ ఐ సురేష్, హోంగార్డ్ ఆఫీసర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మహ్మద్ రఫీ, నాగరాజు, రవి హోంగార్డ్ ఆఫీసర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు