Paytm fraud: పేటిఎంలో కొత్త తరహా మోసం… మీ పేటిఎం చెక్ చేసుకోండి

మంగళగిరి;సిరా న్యూస్;

వ్యాపారస్తుల ఫోన్ పే క్యూఆర్ కోడ్ పై గుర్తుతెలియని వ్యక్తులు వారి ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అంటించి వ్యాపారస్తులను కొత్త తరహాలో మోసం చేస్తున్న వైనం. మంగళగిరి పట్టణంలోని అన్నపూర్ణ డీలక్స్, పాత కూరగాయల మార్కెట్ వద్ద గత నాలుగు రోజులుగా జరుగుతుంది. ఇప్పటికే కొందరు వ్యాపారస్తులు లక్షల రూపాయలకు పైగా దోపిడీకి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నాలుగు రోజులుగా మంగళగిరి పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్, పాత కూరగాయల మార్కెట్ సెంటర్లలో వ్యాపారస్తులు తమ కార్యకలాపాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. ఆ తరువాత రాత్రి సమయాలలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బయట గోడలకు, బోర్డులకు, వ్యాపారస్తులు అంటించిన ఫోన్ పే క్యూఆర్ కోడ్ ను స్కానర్లపై, గుర్తుతెలియని వ్యక్తులు వారి ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అంటించి వెళ్ళిపోతున్నారు. ఉదయం యధావిధిగా షాపుకు వచ్చిన వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫోన్ పే చేసి కస్టమర్లు వెళ్లిపోతున్నారు. ఇది గమనించకపోవడంతో వ్యాపారస్తులు తమ ఖాతాలోకి డబ్బులు రావడం లేదని వాపోతున్నారు.తీరా ఎందుకు రావడం లేదని చూసుకోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను వారి స్టిక్కర్లపై అంటిస్తున్నట్లు వారు గుర్తించారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో వ్యాపారస్తులు ఉన్నారు. బ్యాంక్ అధికారులకా??? పోలీసులకా???? అనే అయోమయ స్థితిలో వ్యాపారస్తులు ఉన్నారు. ఇదే కొనసాగితే మా పరిస్థితి ఏమిటి అని పలువురు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా విస్తరిస్తుందా అనే భయంతో ఉన్న వ్యాపారస్తులు, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *