సిరా న్యూస్,హైదరాబాద్;
వనస్థలిపురం ఎస్కెడి నగర్ లో అర్ధరాత్రి భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసింది. అంబర్ పేట్ కి చెందిన కరుణాకర్ తన భార్య అనసూయ ను కాదని కొంత కాలంగా సుష్మిత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి భర్త కరుణాకర్ సుష్మిత అనే మహిళతో ఒంటరిగా ఉన్న సమయంలో భార్య తన బంధువులతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్ని సుష్మితను, భర్తను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. తన భర్త కరుణాకర్ పై మహిళ సుష్మిత పై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురంలో పిర్యాదు చేసింది.
==