సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు పట్టణం లోని ఆంధ్ర ప్రదేశ్ బి.సి చైతన్య సమితి కార్యాలయంలో గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యాన డిశంబర్ 19 వ తేదీన జరుగనున్న ముస్లిం సమైక్యతా దినోత్సవ కార్యక్రమ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యోగివేమన విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు మాట్లాడుతూ మొదట మనమందరం మనుషులం తర్వాత భారతీయులం కులాలకూ మతాలకూ అతీతంగా మనిషిని మనిషి ప్రేమించాలి గౌరవించాలి అప్పుడే అభివృద్ది సాధ్యమన్నారు. జాతీయ బి.సి సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ మానవ ధర్మాలను పాటిస్తూ ప్రేమ భక్తి కలిగి మానవులందరూ జీవించాలని అన్ని మత గ్రంధాలు చెబుతున్నాయి. హిందూ ముస్లింలు మరియు ఇతర మతాలవారు సోదరభావంతో జీవించినపుడే మానవులంతా ప్రశాంత జీవనం గడగడమని అన్నారు.బి.సి చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బి.సి రమణ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కొరకు పోరాటం చేసిన అష్పుడల్లా ఖాన్,బిస్మిల్ రాంప్రసాద్ అను హిందూ ముస్లిం స్నేహితులను బ్రిటీషు ప్రభుత్వం ఉరితీశారు. వారు అమరుదలైన రోజు డిశంబర్ 19 వ తేదీ జైభారత్ ఆధ్వర్యాన నెల్లూరు పట్టణం లో మరియు బద్వేలు జరుగు పట్టణం లో జరుగు జయహో భారత్, హిందూ ముస్లింల సమైక్యతా దినోత్సవ కార్యక్రమ సభలను జయప్రదంచేయవలసినదిగా కోరినారు. ఈ కార్యక్రమంలో బద్దె కలాపీఠం అధ్యక్షులు సాంబశివారెడ్డి,ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్ భాష(బిగ్ బాస్),పట్టణ అభివృద్ద కమిటి కన్వీనర్ నానబాల వెంకటేశ్వర్లు,ఆవాజ్ కమిటి అధ్యక్ష కార్యదర్శులు యస.ఎ సత్తార్,అన్వర్ భాష, సభ్యులు రసూల్, ఖాజాగౌస్,సంధాని భాష, రిటైర్డ్ తహశిల్దారు రఘురామయ్య,జాతీయ బి.సి సంక్షేమ సంఘ జిల్లా వర్కింగ్ అధ్యక్షులు యు.రమణయాదవ్,యస.యన్ సుబ్బరాయుడు,రంగరాజు,డి.బి.యఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల చిన్నయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.