సిరా న్యూస్,అవనిగడ్డ;
నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి చెందింది. మృతురాలు బంద్రెడ్డి మోహినీ స్వరాజ్యలక్ష్మి (75)గా గుర్తించారు. దగ్గరలోని చెరువులో మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు.మృతురాలు ఒంటరిగా ఉంటోంది. ఒంటిమీద నగలు లేవని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ తెలిపారు.