సిరాన్యూస్, ఆదిలాబాద్
కలెక్టర్‌ను కలిసిన పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను బుధవారం పీఆర్‌టీయూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ కలిశారు. ఈసందర్బంగా ఆయన ఆదిలాబాద్ జిల్లా లోని మండల్ నోడల్ అధికారులకు మండల విద్యా అధికారి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని ఎంఈఓ లకు ఒక్కటి కంటే ఎక్కువ మండలాలు ఇంచార్జి ఉండడం వలన పని భారం ఎక్కువ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు