సిరాన్యూస్,ఆదిలాబాద్
డీఎస్పీ, ఎస్సైలను సన్మానించిన సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
ఆదిలాబాద్ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బదిలీపై వచ్చిన సిహెచ్ కరుణాకర్ ను సీపీఐ నాయకులు సన్మానించారు. బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి , సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు కుంట రాములు, ఎస్ఆర్ఎన్ కుమార్ అర్లి (బి) శాఖ కార్యదర్శి బి సాగర్‌లు ఎస్సై సిహెచ్ కరుణాకర్, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి ని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ లో గుట్కా, మట్కా నిషేధిత పదార్థాలను కొట్లాది రూపాయల విలువ గల వాటిని దాడి చేసి పట్టుకున్నారని, ఇది మంచి శుభ పరిణామని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సీపీఐ తరపున కృతజ్ఞతలు తెలిపారు.