ప్రేమ వ్యవహరంలో తల్వార్ తో దాడి

దంపతుల మృతి..కొడుకు కూతురుల పరిస్థితి విషమమం
సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. పాపయ్యపేట శివారు పదహారు చింతల్ లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్ బానోతు సుగుణతో పాటు కుమారుడు మదన్, కూతురు దీపిక పై తల్వార్ తో దాడి జరిగింది. ఈ దాడిలో బానోతు సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా… శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. కుమారుడు, కూతురు తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం కి తరలించారు. ప్రేమ వ్యవహారంలో మేకల బన్నీ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్టు బంధువులు ఆరోపించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *