Toriti Ravi: తోరితి రవి ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురుచూపు..

సిరా న్యూస్, బోథ్
తోరితి రవి ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురుచూపు..

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధ‌న్నూర్ గ్రామానికి చెందిన తోరితి రవి ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూస్తున్నాడు. అస‌లే పేద‌రికం.. దీనికితోడు అనారోగ్యం.. ఆపై ఆర్థిక భారం.. ఖ‌రీదైన ఆసుప‌త్రుల‌కు వెళ్లి వైద్య చికిత్స పొంద‌లేని ద‌య‌నీయ స్థితి . తోరితి రవి సొంత గ్రామంలో చాకలి వృత్తితో జీవనం గడుపుతున్న ఈయన ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో గత రెండు నెల క్రితం దుబాయ్ దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం వెళ్ళాడు .అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో అనారోగ్యం బారిన పడి తిరిగి రావడం జరిగింది. దీంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించగా 2 లక్షల రూపాయల మేరకు ఖర్చు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని ,చికిత్సకు ప్రతిరోజు 40 వేల రూపాయలు అవసరమవుతాయని, దాతలు ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబీకులు కోరారు. దాతలు 8464033834 నెంబర్ కు ఫోన్ పే చేయాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *