సిరాన్యూస్, ఉట్నూర్
రాథోడ్ రమేష్ మరణం సమాజానికి తీరని లోటు: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* రాథోడ్ రమేష్ పెద్దకర్మ కార్యక్రమం
రాథోడ్ రమేష్ మరణం సమాజానికి తీరని లోటని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పూలాజీ బాబా స్కూల్ ఆవరణలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పెద్దకర్మ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాథోడ్ రమేష్ మరణం సమాజానికి తీరని లోటని అన్నారు.ఈ ప్రాంతానికి అయన చేసిన సేవలను గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.