సిరా న్యూస్,భీమదేవరపల్లి
రక్త దానం ..మహా దానం : బీజేపీ మండల అధ్యక్షుడు పృథ్వీరాజ్ గౌడ్
* హుస్నాబాద్‌లో రక్తదాన శిబిరం
రక్త దానం ..మహా దానమని బీజేపీ మండల అధ్యక్షుడు పృథ్వీరాజ్ గౌడ్ అన్నారు. గురువారం బీమదేవరపల్లి మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజాయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో బీజేపీ మండల ఆధ్యక్షులు పృథ్వీరాజ్ గౌడ్ రక్త దాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, సిద్ధిపేట్ జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభారీ గుజ్జా సత్యనారాయణ రావు, హుస్నాబాద్ నియోజకవర్గం మండల అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.