సిరా న్యూస్, డిజిటల్:
మోదీకి అమెరికా వార్నింగ్… తగ్గేదెవరూ? నెగ్గేదెవరూ?
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై అమెరికా ఘాటుగా స్పందించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను మోడీ కలవడం అమెరికాకు మింగుడు పడటం లేదు. దీంతో మోదీ రష్యా పర్యటణపై అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు భారత దేశపు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని గౌరవిస్తున్నామని చెబుతూనే, కొన్ని సందర్భాల్లో ఈ స్వయంప్రతిపత్తి అంత ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. తనను తాను అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికా తమ మిత్ర దేశం కానీ రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగించండాన్ని జీర్ణించుకోలేకపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నెపంతో అమెరికా మోదీకి ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత పరిణామాలతో భారత్–అమెరికా సంబంధాలు కొంత మేర దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ కూడ, మోదీ అన్నింటికి సిద్ధమైన తరువాతనే రష్యా పర్యటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్, తమ దేశ స్వప్రయోజనాల కోసం ఇతర బలమైన దేశాలతో మైత్రి కోసం అడుగులు వేయడం పూర్తిగా భారత దేశపు వ్యక్తిగత వ్యవహారమైనప్పటికీ కూడ, అమెరికా మాత్రం ఈ విషయాన్ని సీరిసయ్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది.