సిరాన్యూస్, ఓదెల
ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తండ్రి మృతి
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తండ్రి ఆకుల సాంబయ్య (80) శనివారం నాలుగు గంటలకు అనారోగ్యంతో మృతి చెందాడు. సాంబయ్య విద్యుత్ శాఖలో 35 ఏళ్లు లైన్మెన్ గా పనిచేసి పదవి విరమణ పొందారు. సాంబయ్యకు భార్య ఆకుల ఉదయ దేవి తాజా మాజీ సర్పంచ్. పెద్ద కుమారుడు సంజీవరావు ఎంపీడీవో విధులు నిర్వహిస్తున్నారు. రెండవ కుమారుడు ఆకుల మహేందర్ ఓదెల గ్రామ సర్పంచ్ గా రెండు దపాలుగా పని చేశారు. చిన్న కుమారుడు ఉపేందర్. ఆకుల సాంబయ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.